లాక్ డౌన్, తదనంతర పరిణామాలకు తగ్గట్టు కాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్సలో వైద్యులు కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఇంజక్షన్ కీమోథెరపీ మందుల విషయం లో ఓ ప్రాధాన్య క్రమాన్ని వైద్యులు అనుసరిస్తున్నారు ఇందుకోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అఫ్ ఒంకాజీలు కొన్ని మార్గదర్శకాలను సూచించాయి వీటి ప్రకారం తీవ్రం, మధ్యస్థం, స్వల్పం ఇలా వ్యాధి తీవ్రతలను బట్టి రోగులను వర్గీకరించి ఆ క్రమం లో కీమోథెరపీ చికిత్సలో ప్రాధ్యాన క్రమాన్ని పాటిస్తున్నాం. ఉదాహరణకు కొత్తగా కాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన రోగుల కంటే పూర్వం నుంచి కాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కీమోథెరపీ ఇవ్వడం లో ప్రాధాన్యం ఇవ్వక తప్పదు చికిత్స కోసం వేచి ఉంచదగిన రోగులు ప్రత్యామ్నాయ మందులతో వ్యాధి ని అదుపు లో ఉంచదగిన రోగులు ఇలా కాన్సర్ రోగులను వర్గీకరించి చికిత్స అందిస్తున్నాం కొంతమంది రోగుల్లో కాన్సర్ శారీరమంతా పాకిపోయి ఉండవచ్చు ఇలాంటప్పుడు వీరికి కీమో ఇవ్వడం వాళ్ళ ప్రయోజనం ఉండదు కాబట్టి ఎవరికైతే కిమోతో ప్రయోజనం ఉంటుందో ఎవరికైతే కీమో ఇవ్వడం త్యవసరమో వారికే ప్రాధాన్యం ఇచ్చే పద్దతిని అనుసరిస్తున్నాం. చిన్న కాన్సర్ కణతి ఉండి, సర్జరీ తో దాన్ని తొలగించిన వారికీ ఇంజక్షన్ కీమో థెరపీకి బదులుగా టేమాక్సిఫీన్ లిట్రేజోల్ అనే ప్రత్యామ్నాయ నోటి మాత్రలు సూచిస్తున్నాం. ఇలా హై రిస్క్ ఇంటర్మీడియట్ రిస్క్ లో రిస్క్ మూడు విభాగాలుగా రోగులను విభజించి అందుకు తగ్గట్టు కీమోథెరపిని అందిస్తున్నాం. కాబట్టి రోగులు కీమోథెరపీ గురించి కంగారుపడవల్సిన అవసరం లేదు.

Open chat