క్యాన్సర్ ఒక విస్తారమైన వ్యాధులు సమూహం, దీనిలో కణాల యొక్క అసాధారణ పెరుగుదల వలన కణితులు (కణాజాలం యొక్క ముద్దలు లేదా గడ్డలు) ఏర్పడతాయి. క్యాన్సర్ శరీరంలో ఏవిధమైన అవయవం లేదా కణజాలాల కణాలనైనా (cells) ప్రభావితం చేస్తుంది మరియు చాలా వేగంగా వృద్ధి చెందుతుంది, శరీరంలో వివిధ భాగాలకు వ్యాపించవచ్చు లేదా ఒకే చోట పెరుగుతూనే ఉండవచ్చు. స్వభావం ఆధారంగా, కణితులు నిరపాయమైనవి (benign) గా ఉంటాయి (వ్యాప్తి చెందనివి) లేదా ప్రాణాంతకమైనవి (వ్యాప్తి చెందేవి) గా ఉండవచ్చు.

Top view star shaped frame with ribbons Free Photo

వివిధ రకాలైన క్యాన్సర్ల యొక్క కారణాలు వేరువేరుగా ఉంటాయి, అయితే కొన్ని సాధారణ క్యాన్సర్లకు కారణాలు జీన్ మ్యుటేషన్లు (జన్యు ఉత్పరివర్తనలు), ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహార విధానం, రసాయనాలు లేదా రేడియోధార్మికతకు గురికావడం మరియు మొదలైనవిగా ఉన్నాయి. భౌతిక పరీక్ష,ఎక్స్రేలు, సిటి (CT) స్కాన్, ఎంఆర్ఐ (MRI) మరియు పెట్ (PET) స్కాన్ల ద్వారా క్యాన్సర్ రోగ నిర్ధారణ చేయవచ్చు.

క్యాన్సర్ కారణాలు మరియు ప్రమాద కారకాలను నివారించడం ద్వారా క్యాన్సర్లను చాలా వరకు అరికట్టడం సాధ్యపడుతుంది. చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, మరియు శస్త్రచికిత్స వంటి ఒకేరకమైన లేదా వివిధ రకాలైన విధానాలు ఉంటాయి. నిర్దిష్టమైన క్యాన్సర్లను ప్రారంభ దశల్లో గుర్తించినట్లయితే తక్షణమే చికిత్స అందించవచ్చు మరియు పూర్తిగా నయం చేయవచ్చు. అయితే, ఇది ఎల్లప్పుడూ సాధ్యపడనప్పటికీ, క్యాన్సర్ వ్యాప్తిని పరిమితం చేయడానికి, రోగి యొక్క జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి మరియు సమస్యలను తగ్గించటానికి అనేక రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

Open chat